Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.9గా నమోదైంది. రాత్రి 7 గంటల 57 నిమిషాలకు ఉత్తర భారత దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు జమ్మూకశ్మీర్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, లాహోర్ తదితర ప్రాంతాల్లోనూ భూమి కంపించారు. భూ ప్రకంపనలతో జనం వీధుల్లోకి పరుగులు తీశారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫయాజాబాద్లో భూమికి 200 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. ఢిల్లీలో ఈ ఏడాది జనవరి ఒకటిన కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదైంది. హర్యానాలోని ఝజ్జర్‌లో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గత ఏడాది నవంబర్ 12న కూడా ఢిల్లీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.4గా నమోదైంది. నేపాల్‌లో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.