Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్
పక్కింటి బాలికపై కన్నేశారో ఇద్దరు అన్నదమ్ములు. పదో తరగతి చదువుతున్న ఆ బాలికకు మాయమాటలతో దగ్గరై ఒకరికి తెలియకుండా మరొకరు లైంగికదాడికి పాల్పడ్డారు. ఆరు నెలలుగా దారుణానికి తెగబడుతూ తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. వరంగల్ నగరంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం వరంగల్ వలస వచ్చింది. స్థానికంగా ఓ కాలనీలో బంధువుల ఇంట్లో అద్దెకు ఉంటోంది.
ఆ ఇంటి పెద్ద డ్రైవర్గా పని చేస్తుండగా అతని కుమార్తె(15) స్థానికంగా ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అయితే, వారి పక్కంటిలో ఉండే మహ్మద్ అజ్మత్ అలీ (26), మహ్మద్ అక్బర్ అలీ (22) అనే సొంత అన్నదమ్ములు ఆ బాలికపై కన్నేశారు. ఇరుగుపొరుగు కావడంతో పరిచయం పెరిగి ఆ బాలికను పలుమార్లు పాఠశాలకు కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలో మాయమాటలతో మభ్యపెట్టి ఒకరికి తెలియకుండా మరొకరు ఆ బాలికను శారీరకంగా వాడుకున్నారు. ఆరు నెలలుగా తమ కోరిక తీర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని బాలిక కూడా బయటపెట్టలేదు. అయితే, బాలిక కుటుంబసభ్యులకు చెందిన ఫోన్కు ఇటీవల వచ్చిన మెసేజ్లతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు ప్రశ్నించగా బాలిక అసలు విషయాన్ని వెల్లడించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.