Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం వచ్చింది. గురువారం రాత్రి హిందూ కుష్ రీజియన్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఫైజాబాద్‌కు 79 కిలోమీట్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 200 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. కాగా, దీని ప్రభావంతో న్యూఢిల్లీ, రాజస్థాన్, జమ్ముకశ్మీర్‌లో భూమి స్వల్పంగా కంపించిందని అధికారులు వెల్లడించారు. ఐదు రోజుల వ్యవధిలో ఢిల్లీలో భూకంపం రావడం ఇది రెండోసారి. జనవరి 1న ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో 3.9 తీవ్రతతో భూ కంపించింది. కాగా, అఫ్గాన్‌లో భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం తెలియరాలేదని అధికారులు తెలిపారు.