Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కామారెడ్డి బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి వెల్లడించారు. కామారెడ్డి రైతు జేఏసీ ఇచ్చిన బంద్కు కాంగ్రెస్ శ్రేణులు మద్దతు ఇచ్చి అంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసి ప్రజా క్షేత్రంలో సభలు జరిపి రైతులతో చర్చించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే సమస్య జఠిలం అయ్యిందన్నారు. వెంటనే ప్రభుత్వం రైతులతో చర్చించి సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.