Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రెండో టీ20లో టీం ఇండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ రికార్డు సృష్టించాడు. భారత్ తరపున ఏడో నంబర్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక స్కోరు (65) చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఇంతవరకు జడేజా(44) పేరిట ఆ రికార్డు ఉంది. తాజాగా అక్షర్ పటేల్ దానిని బద్దలు కొట్టాడు. అంతేకాదు టీమిండియా తరఫున ఒక టి20 మ్యాచ్ లో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అర్థ సెంచరీ బాదిన తొలి బ్యాటర్ గా అక్షర్ పటేల్ నిలిచాడు. కాగా, 207 పరుగుల భారీ లక్ష్య చేదనలో 57 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా, అక్షర్ పటేల్, సూర్య కుమార్ యాదవ్ అద్భుత హాఫ్ సెంచరీలు, శివమ్ మావి మెరుపులతో ఆఖరి ఓవర్ వరకు పోరాడి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 190 పరుగులే చేసిన టీమిండియా 16 పరుగుల తేడాతో ఓడింది.