Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భోపాల్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. చోర్హటా పట్టణంలో శిక్షణ విమానం శుక్రవారం తెల్లవారుజామున ఓ ఆలయాన్ని ఢీకొని కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమాన ట్రైనీ పైలెట్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన పైలెట్ ను సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. కుప్పకూలిన విమానం శిక్షణ సంస్థదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.