Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నగరంలోని మూసాపేట్ మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి మెట్రో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు వ్యక్తి టికెట్ లేకుండా మెట్రో స్టేషన్ నుంచి ఫ్లాట్ఫాంపైకి వెళ్లి.. మెట్రో ట్రైన్ వస్తుండగా దూకేశాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై మూసాపేట్ స్టేషన్ కంట్రోలర్ పులెందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.