Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పోలీస్ ఉద్యోగ నియామకాల్లో దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన పోలీస్, కానిస్టేబుల్ అభ్యర్థులకు గత నెల 8న ఫిజికల్ ఈవెంట్స్ ప్రారంభించారు. అవి గురువారంతో ముగిశాయి. ఈ పరీక్షలకు 2.07 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటిలో అర్హత సాధించినవారికి మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ మూడో వారం వరకు మెయిన్స్ నిర్వహిస్తారు. కాగా, 554 ఎస్సై పోస్టులకు 52,786 మంది అభ్యర్థులు మెయిన్స్ రాయనున్నారు. 15644 కానిస్టేబుల్ పోస్టులకుగాను 90,488 మంది, 614 ఆబ్కారీ కానిస్టేబుల్ పోస్టులకు 59,325 మంది అభ్యర్థులు మెయిన్స్ రాయనున్నారు.