Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ కాలేజీ విద్యార్థులను వేధిస్తున్న సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు ప్రదీప్‌తోపాటు మరో ఇద్దరు యువకులను విజయవాడలో రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముగ్గురు విజయవాడకు చెందినవారిగా గుర్తించారు. వారిని హైదరాబాద్ తరలిస్తున్నారు. గత రెండు నెలలుగా 8 ఫోన్ నంబర్ల నుంచి అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఘట్కేసర్ మండలం అవుషాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత సమాచారం హ్యాక్ చేసినట్లు కాలేజీ హాస్టల్ వార్డెన్‌కు చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు.