Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. వరుసగా మూడో సెషన్లో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. విదేశీ మదుపరులు ఇన్వెస్ట్ మెంట్లను వెనక్కి తీసుకుంటుండటం మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 452 పాయింట్లు కోల్పోయి 59,900కి పడిపోయింది. నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 17,859 కి దిగజారింది. ఈ తరుణంలో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సూచీ మినహా అన్ని సూచీలు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి.