Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : వరంగల్ నగరంలోని ఓ కాలనీలో పదిహేనేళ్ల బాలికపై ఆమె ఇంటి సమీపంలో నివసిస్తున్న ఇద్దరు అన్నదమ్ములు లైంగికదాడి చేశారు. ఆమె నగ్న చిత్రాలు, వీడియోలు తీసి బెదిరించి.. పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి వరకు చదివిన బాలిక ఇంటి వద్ద ఉంటోంది. అదే ప్రాంతంలో ఉంటున్న అన్నదమ్ములు అజ్మద్ అలీ(26), అబ్బు(22) ఆమెకు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకున్నారు. ఎవరూ లేని సమయంలో ఒకరికి తెలియకుండా మరొకరు ఇంటికి పిలిపించి పలుమార్లు లైంగికదాడి చేశారు. లైంగికదాడి సమయంలో ఆమె నగ్న చిత్రాలు, వీడియోలు తీశారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతామని బాలికను బెదిరించేవారు. బాలికకు నిందితులు పలుమార్లు సైగలు చేయడం గమనించిన తల్లి మందలించడంతో ఆమె జరిగిన విషయం చెప్పింది. దీంతో మిల్స్ కాలనీ పోలీసులకు బాలిక తల్లి గురువారం ఫిర్యాదు చేసింది. అజ్మద్ అలీ, అబ్బుపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. నిందితుల ఇంటిపై బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి దాడి చేశారు. ఇంటి ఎదుట నిలిపిన వాహనాలను ధ్వంసం చేశారు.