Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో డబుల్ సందడితో దూసుకుపోతుంది. ఈ మధ్య కాలంలో ఈ టాక్ షోకు వచ్చినంత క్రేజ్ దేనికి రాలేదనండంలో అతిషయోక్తి లేదు. సీజన్-1కు అనూహ్య రెస్పాన్స్ రావడంతో ఆహా సంస్థ సీజన్-2ను ఇటీవలే స్టార్ట్ చేసింది. మొదటి ఎపిసోడ్ నుండి ఈ టాక్ షో మంచి వ్యూవర్షిప్ను సాధిస్తూ వచ్చింది. సినీ ప్రముఖుల నుండి పొలిటీషియన్స్ వరకు అందరితో బాలయ్య చేసిన అల్లరి ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. ఇక ఇటీవలే ఈ షోకు ప్రభాస్ గెస్ట్‌గా వచ్చాడు. రెండు పార్టులుగా ప్రభాస్ ఎపిసోడ్ తెరకెక్కింది. కాగా న్యూఇయర్ కానుకగా ఆహా సంస్థ మొదటి ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేసింది. కాగా మొదటి ఎపిసోడ్‌కు ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన 12గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. కాగా తాజాగా రెండో ఎపిసోడ్‌ను ఆహా విడుదల చేసింది. ఈ ఎపిసోడ్‌కు హీరో గోపిచంద్ కూడా వచ్చాడు. ఈ ఎపిసోడ్లో బాలకృష్ణ 'మీరిద్దరూ ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డారు కదా ఎవరామే?' అని అడిగాడు. దానికి ప్రభాస్, గోపిచంద్‌తో 'చెప్పొద్దురా' అంటూ అడ్డుకున్నాడు. కానీ గోపిచంద్ 'అవును సర్ మేము 2004లో వర్షం సినిమాలో త్రిష కోసం గొడవపడ్డాం' అని చెప్పాడు. దానికి ప్రభాస్ 'మా వాడు సూపర్‌గా సమాధానం ఇచ్చాడు' అంటూ నవ్వాడు. ఇదంతా చూస్తున్న బాలకృష్ణ 'ఒంగోలు తెలివితేటలు ఇక్కడ వాడకు' అంటూ గోపిచంద్‌ను సరదాగా అన్నాడు.