Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ప్రయివేటు బస్సు అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం వద్ద చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కాణిపాకం నుంచి 40 మంది యాత్రీకులతో నల్గొండ జిల్లా యాదాద్రికి బస్సు బయలుదేరింది. ఈరోజు మధ్యాహ్నం అంకన్నగూడెం వద్దకు రాగానే బస్సు డ్రైవర్ బాబు(50) గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ తరుణంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ సీట్లోనే కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో ఊపిరిపీల్చుకున్నారు.