Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడెక్షన్ డిజైనర్ సునీల్ బాబు (50) హఠాన్మరణం చెందారు. గురువారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కేరళలోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో మలయాళీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల సంతాపం తెలుపుతూ దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, వైజయంతి మూవీస్ సోషల్మీడియాలో పోస్టులు పెట్టారు. మలయాళీ పరిశ్రమలో తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు సునీల్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. అనంతరం ఆయన తెలుగు, తమిళం, హిందీ చిత్రాలకూ ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరించారు. 'సీతారామం', 'ఎం.ఎస్.ధోనీ', 'లక్ష్యం', హిందీలో వచ్చిన 'గజిని'తోపాటు విడుదలకు సిద్ధంగా ఉన్న 'వారిసు'కు సైతం ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు.