Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలతో తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడితే.. కేంద్రం రూ.100 లక్షల కోట్ల అప్పు చేసి ఏం మంచి పనులు చేసిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ నిధులతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారని.. ఈ విషయం తప్పని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో పర్యటించిన మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారు. తెలంగాణ ప్రజలు వివిధ పన్నుల రూపంలో ఎనిమిదేళ్లలో కట్టిన రూ.3.6 లక్షల కోట్లు. కేంద్రం నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చింది రూ.1.68 వేల కోట్లు. తెలంగాణ నిధులతో వెనుకబడిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వినియోగిస్తున్న మాట వాస్తవం కాదా? నేను చెప్పేది అబద్ధమైతే.. నా మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేసేందుకు సిద్ధం. నేను చెప్పింది తప్పని రుజువు చేయకపోతే కేంద్ర మంత్రి రాజీనామా చేస్తావని అనుకోను కానీ, కనీసం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పే సంస్కారం ఉందా? అని కిషన్‌రెడ్డిని అడుగుతున్నా. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్షా 24 వేలు కాగా.. ఈరోజు రూ.2లక్షల 78 వేలు. నరేంద్ర మోడీ నాయకత్వలో దేశ తలసరి ఆదాయం రూ.లక్షా 49 వేలు మాత్రమే. అంటే మనలో సగం. మరి ఎవరు సమర్థుడు? ఎవరు అసమర్థుడు? అని కేటీఆర్ ప్రశ్నించారు.