Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి రేపు (జనవరి 7) ట్రైలర్ రిలీజ్ కానుంది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. అటు, జనవరి 8న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విశాఖ నగరం ఆతిథ్యమిస్తోంది. వేదిక మార్పు నేపథ్యంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ 'వాల్తేరు వీరయ్య' చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ నటించగా, రవితేజ, కేథరిన్ ట్రెసా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్టయ్యాయి. ఇక, రేపు విడుదలయ్యే ట్రైలర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.