Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
డాక్టర్ విశ్వరాజ్ వేమల బ్రిటన్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్స్ బర్మింగ్‌హామ్‌లో కన్సల్టెంట్ హెపటాలజిస్ట్‌గా వైద్య సేవలందిస్తున్నారు. తన తల్లిని బెంగళూరులోని సొంత ఇంటికి తీసుకువచ్చేందుకు నవంబర్‌లో ఎయిర్ ఇండియా విమానంలో భారత్‌కు ప్రయాణించారు. అయితే ఆ విమానంలో ప్రయాణించిన 43 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో సీటు నుంచి కిందకు పడిపోయాడు. గమనించిన విమాన సిబ్బంది డాక్టర్ కోసం అనౌన్స్ చేశారు. దీంతో డాక్టర్ విశ్వరాజ్ వెంటనే స్పందించి రోగి వద్దకు వెళ్లారు. విమాన సిబ్బంది సహాయంతో గంటపాటు సీపీఆర్ చేసి ఆయన స్పృహలోకి వచ్చేలా చేశారు. విమానంలో ఉన్న ఎమర్జెన్సీ కిట్ ద్వారా ఆక్సిజన్, ఇతర వైద్య సేవలు అందించారు.
అయితే గుండెపోటుకు గురైన ఆ వ్యక్తి హార్ట్ రేట్, బీపీ, పల్స్, ఆక్సిజన్ స్థాయిలు తెలుసుకునేందుకు విమానంలో ఎలాంటి పరికరాలు లేవు. దీంతో విమాన సిబ్బంది వాటి కోసం మరోసారి అనౌన్స్మెంట్ ఇచ్చారు. లక్కీగా కొందరు ప్రయాణికుల వద్ద అవి ఉన్నాయి. దీంతో వాటి ద్వారా ఆ వ్యక్తి పరిస్థితిని తెలుసుకున్నారు. అయితే డాక్టర్‌తో మాట్లాడుతూనే ఆ వ్యక్తి రెండోసారి గుండెపోటుకు గురయ్యాడు. దీంతో డాక్టర్ విశ్వరాజ్ మరో గంటపాటు సీపీఆర్ చేయడంతో ఆ వ్యక్తి కొంత కోలుకున్నాడు.