Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మలక్పేట ప్రధాన రహదారిలో ఉన్న హోటల్ సోహెల్లో శుక్రవారం మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో ఆకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. మంటలు ఎగిసిపడటం, పొగలు కమ్ముకోవడంతో భయంతో హోటల్ సిబ్బంది, కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో హోటల్ కార్మికుడు షాబుద్దీన్(35) ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని, మంటలను ఆర్పేసింది. ప్రమాద వివరాలను స్థానిక ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ హోటల్ పక్కనే ప్రభుత్వ ఆస్పత్రి ఉండటంతో.. మంటలు అటు వైపు వ్యాపించకుండా పోలీసులు, స్థానికులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.