Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు గ్రామంలో గాజులపాటి కల్యాణ్ అనే వ్యక్తి తన ప్రేమను అంగీకరించలేదని మాణిక్యం అనే యువతిపైనా, ఆమె కుటుంబసభ్యులపైనా దాడి చేశాడు. ఈ ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఖండించారు. ఆమె నేడు ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
దాడికి దారితీసిన సంఘటనల పూర్వపరాలను కల్యాణి కుటుంబ సభ్యులను, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో వేగంగా దర్యాప్తు జరపాలన్నారు. ఈ విషయంపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో వాసి రెడ్డి పద్మ ఫోన్లో మాట్లాడారు. ఆ ప్రేమోన్మాదిపై హత్యా ప్రయత్నం కింద కేసు పెట్టడంతోపాటు రౌడీ షీట్ కుడా తెరవాలని జిల్లా ఎస్పీని కోరామని ఆమె తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం మహిళా కమిషన్ అండగా ఉంటుందన్నారు.