తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం అనుబంధ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డ్ ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ కాలేజీలో చదువుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షల ఫీజుని ఆ కాలేజీలకు దగ్గరలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ల నుండి చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇంటర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక, మొదటి సంవత్సరం విద్యార్థులను వెంటనే ఆ కాలేజీని వదిలి ఇతర గుర్తింపు ఉన్న కాలేజీల్లో చేరాల్సిందిగా చెప్పాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అయితే, ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా 24 కాలేజీలు అనుబంధ గుర్తింపు పొందలేదు అని తెలుస్తోంది. సంబంధిత కాలేజీలకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.