Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మహిళపై మూత్రవిసర్జన చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే ఎయిర్ లైనర్ రెగ్యులేటర్ అథారిటీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. ఆ తరుణంలో తాజాగా విమానంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన సందర్భంలో తీసుకోవాల్సిన నియమాల గురించి మార్గదర్శకాలను జారీ చేసింది. వికృతంగా ప్రవర్తించే సమయంలో ప్రయాణికుడిపై నియంత్రణ పరికరాలు వాడవచ్చని తెలిపింది. దీంతో పాటు ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించడంలో విఫలం అయితే సదరు ఎయిర్‌లైన్ సిబ్బంది చర్యలు తీసుకుంటారని ఆ దేశ విమానయాన నియంత్రణ సంస్థ శుక్రవారం తెలిపింది.