Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహా రెడ్డి' సినిమా రూపొందింది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 'ఒంగోలు'లో నిర్వహించారు. ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ .. 'నట సింహం వీరసింహమై గర్జిస్తే ఆ గర్జన ఎలా ఉంటుందో 'వీరసింహా రెడ్డి' అలా ఉంటుంది' అన్నాడు. అన్ని వర్గాల వారికి కావలసిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కత్తులుంటాయి .. కన్నీళ్లు ఉంటాయి, కవ్వింతలు ఉంటాయి .. కేరింతలు ఉంటాయి. బాలయ్య బాబు అభిమానులంతా ఈ సినిమాతో పండుగ చేసుకోవచ్చు. బాలాయ్య బాబు డైలాగ్ చెబుతుంటే అప్పుడే పుట్టిన బిడ్డకి అమ్మ ముద్దు పెడుతున్నట్టుగా ఉంటుంది. నాలాంటి వాడికి పెద్ద కూతురు పెళ్లి కుదిరినట్టుగా ఉంటుంది. ఇలాంటి సినిమాలో నేను భాగమైనందుకు గర్వపడుతున్నాను అని చెప్పాడు. శ్రుతి హాసన్ విషయానికొస్తే .. కమల్ హాసన్ లో ఎంత కామెడీ టైమింగ్ ఉందో .. ఆమెలో అంత కామెడీ టైమింగ్ ఉంది .. మీరంతా ఎంజాయ్ చేస్తారు. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మెప్పిస్తారు. ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ అవుతుంది. ఇంత గొప్ప సినిమాకి పనిచేసే అవకాశాన్ని ఇచ్చిన గోపీచంద్ మలినేనికి నేను థ్యాంక్స్ చెబుతున్నానుఁ అంటూ ముగించాడు.