Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ గండ్రాతి సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర కార్తీక్, కిన్నెర కిశోర్ అనే ఇద్దరు విద్యార్థులు మండలంలోని గుర్తూరు మోడల్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. ఈ నెల 4న రోజువారిలాగే పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల బంధువుల ఇండ్లలో వెతికినా ఎక్కడా ఆచూకి తెలియకపోవడంతో తల్లిదండ్రులు శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థుల బంధువులు కిన్నెర వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.