Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన మహిళా రైతు కూలీలను శుక్రవారం ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆప్యాయంగా పలుకరించారు. కూలీలు నాట్లు వేసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కారు ఆపి వారి వద్దకు వెళ్లారు. కూలీలతో మమేకమై ముచ్చటించారు. 'పొలం పనులు ఏ విధంగా సాగుతున్నాయి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా' అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఓ మహిళా కూలీ తను తినే అన్నాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు ప్రేమగా తినిపించింది.