Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకుంటున్నారు. వైకుంఠద్వార దర్శనం కోసం భక్తులు ఆసక్తి చూపుతున్నారు. నిన్న స్వామివారిని 45,887 మంది భక్తులు దర్శించుకోగా 17,702 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.53 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. కాగా నిన్న తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికారు. అర్చకులు అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు.