Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అమెరికాలోని ఓ ఎలిమెంటరీ స్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల వయసున్న విద్యార్థి ఒకరు గన్ తో తన టీచర్ పై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రగాయాలపాలైన టీచర్ ను మిగతా టీచర్లు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ టీచర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వివరించారు. ఈ ఘటనలో విద్యార్థులు ఎవరికీ ఏమీ కాలేదని టీచర్లు తెలిపారు. వర్జీనియా రాష్ట్రంలోని రిచ్నెక్ ఎలిమెంటరీ స్కూలులో శుక్రవారం నాడు ఈ దారుణం చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన కుర్రాడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగింది కాదని ప్రాథమిక విచారణలో తేల్చారు. ఆ కుర్రాడి చేతికి గన్ ఎలా వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై సిటీలోని స్కూళ్ల సూపరింటెండెంట్ జార్జి పార్కర్ స్పందిస్తూ.. ఆరేళ్ల బాబు గన్ తో కాల్పులు జరిపాడన్న వార్త తనను షాక్ కు గురిచేసిందని చెప్పారు. టీనేజ్ పిల్లలకు తుపాకులు అందుబాటులో లేకుండా చూడాలని తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, గతేడాది అమెరికాలో జరిగిన తుపాకీ కాల్పుల ఘటనల్లో 44 వేల మంది చనిపోయారని అధికారుల చెప్పారు. దులో దాదాపు సగం హత్యలు, ప్రమాదాలు, ఆత్మరక్షణ కోసం జరిగినవి కాగా, మరో సగం ఆత్మహత్యలని పేర్కొన్నారు.