Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు
మైనర్ బాలికతో మాట్లాడుతున్నాడని ముస్లిం యువకుడిపై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చోటుచేసుకున్నది. హఫీద్ అనే యువకుడికి సామాజిక మాధ్యమైన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడాది క్రితం 17 ఏండ్ల బాలిక పరిచయమైంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరు ఓ బస్టాప్‌లో కలుసుకుంటున్నారు. ఎప్పటిలానే ఈ నెల 5న కూడా వారిద్దరు అదే చోట కలుకుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో జీప్‌లో వచ్చిన కొందరు అతడిని ఎత్తుకెళ్లిపోయారు. నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లి విచక్షణా రహితంగా కొట్టి అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ యువకుడు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మరుసటి రోజు (జనవరి 6న) బాలిక తండ్రి.. హఫీద్‌పై ఫిర్యాదు చేశాడు. తన కూతురిని ఫోన్ నంబర్ ఇవ్వాలని వేధిస్తున్నాడని, ఆమె దానికి నిరాకరించడంతో బెదిస్తున్నాడని పేర్కొన్నాడు. దీంతో అతనిపై పోస్కో చట్టం కింద కేసు నమోదుచేశారు.