Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నందమూరి బాలయ్యకు పెను ప్రమాదం తప్పింది. నందమూరి బాలయ్య ప్రయాణించిన హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయింది. బాలయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతికలోపం నెలకొంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే, మళ్లీ ఒంగోలులో ల్యాండింగ్ చేశారు పైలెట్. దీంతో నందమూరి బాలయ్యకు పెను ప్రమాదమే తప్పింది. విమాన మార్గం ద్వారా నందమూరి బాలయ్య.. హైదరాబాద్ వస్తున్నారని టాక్. ఇది ఇలా ఉండగా, వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఉన్న నేపథ్యంలో బాలయ్య.. ప్రత్యేక హెలికాప్టర్ లో ఒంగోలు చేరుకున్న సంగతి తెలిసిందే.