Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆంధ్రప్రదేశ్
ఇప్పటివరకు గ్రూప్ 2 మెయిన్స్‌ను మూడు పేపర్లలో నిర్వహిస్తుండగా వాటిని రెండుకు కుదించేశారు. ఈ మేరకు శుక్రవారం జీవో 6ను విడుదల చేసింది ప్రభుత్వం. పరీక్ష విధానం, సిలబస్‌పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ఆమోదిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, గతంలో గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్టును 150 మార్కులకు నిర్వహించేవారు. మెయిన్స్‌లో పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉండేది. అలాగే మరో రెండు పేపర్లుండేవి. పేపర్‌కు 150 చొప్పున 450 మార్కులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించేవారు.
ఈసారి నుంచి ఈ విధానంలో మార్పులు జరగనున్నాయి. గతంలో మెయిన్స్‌లో పేపర్1గా ఉన్న జనరల్ స్టడీస్‌ను రద్దు చేసి దాన్ని స్క్రీనింగ్ టెస్టుకు మార్చారు అధికారులు. దీనిని గతంలో మాదిరిగానే 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇక మెయిన్స్‌ను రెండు పేపర్లకు తగ్గిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 చొప్పున 300 మార్కులు ఉండనున్నాయి. ఏపీ సామాజిక చరిత్ర, ఉద్యమాలు, భారత రాజ్యాగం పేపర్ 1గా 150 మార్కులకు ప్రశ్నాపత్రం రూపొందించనున్నారు. మరో 150 మార్కులకు రెండో ప్రశ్నాపత్రంగా భారత, ఏపీ ఎకానమి, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నాపత్రం తయారు చేస్తారు.ఈ మేరకు మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఆర్ధికశాఖ మానవ వనరుల విభాగం.