Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగరంలోని పాతబస్తీలో ఆరుచోట్ల సీబీఐ సోదాలు చేపట్టింది. ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలపై సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లింపుల విషయంపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోదాలు జరుగుతున్నాయి. డాక్టర్ అంజూమ్ సుల్తాన్ ఇంట్లో సీబీఐ తనిఖీలు నిర్వహించింది. అంజూమ్ భర్త ఆటో మొబైల్ కంపెనీలో ఉద్యోగి. ఆజాంపురలోని అంజూమ్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.