Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నగర శివార్లలోని హయత్‌నగర్‌లో కొకైన్ సరఫరా చేస్తున్న నైజీరియన్‌ను ఎక్సైజ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి 178 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి తీసుకొచ్చి నగరంలో అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎవరికి విక్రయిస్తున్నారనే విషయంపై ఆరాతీస్తున్నారు. నైజీరియన్ వెనక ఏమైనా స్థానిక ముఠాలు ఉన్నాయా అనేకోణంలో విచారిస్తున్నారు.