Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో భారీ దోపిడీ జరిగింది. బార్ యజమాని నుంచి రూ. 2 కోట్లు దోపిడీ దొంగలు దొంగిలించారు. వివరాల్లోకి వెల్తే.. వనస్థలిపురంలో ఉన్న ఎంఆర్ఆర్ బార్ మేనేజర్ వెంకట్రామిరెడ్డి రూ. 2 కోట్లతో ఇంటికి వెళ్తున్నాడు. వెంకట్రామిరెడ్డి, మరో వ్యక్తి కలిసి వెళ్తున్న బైక్ను దుండగులు వనస్థలిపురం చౌరస్తాలో అడ్డగించారు. అనంతరం వారిద్దరిపై దాడి చేసి రూ. 2 కోట్ల నగదును లాక్కెళ్లారు. అప్రమత్తమైన వెంకట్రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగదు దొంగిలించిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వనస్థలిపురం చౌరస్తాలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.