Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌పై సీబీఐ కోర్టు నేడు విచారణ జరిపింది. చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై 20 వతేదీన విచారణ జరుపుతామని సీబీఐ కోర్టు తెలిపింది. 13,656 పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసినట్టు సీబీఐ కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు. దీనిలో తాజాగా 5గురు నిందితులు, 7 కంపెనీలపై అభియోగాలు మోపడం జరిగింది. ఇప్పటి వరకూ ఈడీ దాఖలు చేసిన మొత్తం చార్జిషీట్లో ఆరుగురు వ్యక్తులు, 11 కంపెనీలు ఉన్నాయి. చార్జీ షీట్లో ఇప్పటి వరకూ 17 మంది నిందితుల పేర్లను ఈడీ పేర్కొంది. సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అమిత్ అరోరా, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్.. ఈడీ దాఖలు చేసిన సప్లైమెంటరీ చార్జిషీట్లో ఉన్నారు.