Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ దవాఖాన, మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ, సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 9వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 106 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి అనాటమీ, సైకాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, ఆంకాలజీ, జనరల్ మెడిసిన్, రేడియో డయాగ్నొసిస్, ఆప్తల్మాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, ఓబీజీవై, పాథాలజీ, పెడల్ట్రిక్స్, నియోనటలాజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, డెంటిస్ట్రీ డిపార్ట్మెంట్లలో ఉన్నాయి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 106
ఇందులో ఎస్సీ 22, ఎస్టీ 8, ఓబీసీ 31, జనరల్ 28, ఈడబ్ల్యూఎస్ 17 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ చేసి ఉండాలి.
వయోపరిమితి: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.500
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 9
దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 16
ఇంటర్వ్యూలు: జనవరి 20 నుంచి ప్రారంభం
వెబ్సైట్: www.esic.gov.in