Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ ఎనిమిది గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. తన భూమి పోతుందేమోననే భయంతో ఒక రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మాట్లాడుతూ రైతు ఆత్మహత్య చాలా బాధను కలిగించిందని చెప్పారు. రైతులకు మంచి రోజులు వచ్చాయని, ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. రైతులకు అండగా తాను ఉన్నానని, జిల్లా కలెక్టర్ ను కలిశానని చెప్పారు. రైతులకు వ్యతిరేకంగా మాస్టర్ ప్లాన్ ఉండబోదని, ఈమేరకు తాను కూడా హామీ ఇస్తున్నానని అన్నారు. ఎవరో రెచ్చగొట్టారని రెచ్చిపోవద్దని సూచించారు. పది రోజుల్లో రైతులకు అనుకూలంగా ప్రకటన వెలువడకపోతే తానే ధర్నాకు కూర్చుంటానని చెప్పారు.