Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వరంగల్లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్ఆర్యూహెచ్ఎస్)-అనుబంధ కళాశాలల్లో ఆయుష్ పీజీ (ఎండీ) కోర్సుల్లో ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీని ద్వారా హోమియో, ఆయుర్వేదం, యునానీ కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. ఏఐఏపీజీఈటీ 2022 స్కోర్, కౌన్సెలింగ్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్ల వివరాలను కౌన్సెలింగ్ నాటికి ప్రకటిస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. కోర్సు పూర్తయ్యే వరకు స్టయిపెండ్ సౌకర్యం కల్పిస్తారు.