Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. సీనియర్ మెన్స్ జాతీయ జట్టు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మరోసారి చేతన్ శర్మను నియమిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ తరుణంలో శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్యానెల్లో సభ్యులుగా శివ్ సుందర్ దాస్, సుబ్రోతో బెనెర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ నియమితులయ్యారు.
పురుషుల సీనియర్ సెలెక్షన్ కమిటీని బీసీసీఐ నియమించింది. చేతన్ శర్మను కమిటీకి ఛైర్మన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది్ణ్ణ అని బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ద్వారా తెలిపింది. దాదాపు 50 మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ముఖాముఖిలు నిర్వహించి సెలెక్టర్ల జాబితాను బీసీసీఐకి అప్పగించింది.