Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దర్శకుడు సురేందర్ రెడ్డి కాలికి గాయం అయింది. అఖిల్ అక్కినేని నటిస్తున్న సినిమా 'ఏజెంట్' షూటింగ్ అవుతుండగా ఒక రాడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాలు మీద పడి.. ఎడమ కాలుకి గాయం అయిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఆయనని వెంటనే దగ్గరలో వున్న ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించినట్టుగా తెలిసింది. 'ఏజెంట్' సినిమా మొదలు పెట్టి చాలా కాలం అయి, ఇప్పుడిప్పుడే చివరి దశలో వుంది అని కూడా తెలిసింది. అయితే ఈరోజు శనివారం షూటింగ్ సమయంలో సురేందర్ రెడ్డి కెమెరా ముందు నుండి సూచన ఇవ్వడానికి లేచి ముందుకు వెళ్ళటంతో అక్కడే వున్న ఒక రాడ్ సురేందర్ రెడ్డి కాలు మీద పడిందని తెలిసింది. అయితే కాలు మీద పడింది కాబట్టి సరిపోయింది కానీ, ఇంకా తల మీద పడితే ఇంకా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని యూనిట్ సభ్యులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కాలుకి వెంటనే కట్టుకట్టి కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని కూడా డాక్టర్లు చెప్పినట్టుగా తెలిసింది. అఖిల్, మిగతా యూనిట్ సభ్యులు వెంటనే సురేందర్ రెడ్డి దగ్గరకి చేరుకోవటం, ఆ వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్ళటం జరిగిందని తెలిసింది. సురేందర్ రెడ్డి చక్రాల కుర్చీలో కూర్చొని వున్నాడు. సినిమా లేట్ అవ్వకూడదు అని సురేందర్ రెడ్డి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకోవాలని నిర్ణయించుకున్నాడని కూడా తెలిసింది.