Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కూకట్పల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నాలుగో అంతస్తు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది బయటకు వెలికితీసింది. పలువురికి గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఘటనాస్థలిలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే ఐదో అంతస్తులో స్లాబ్ వేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.