Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై బాబీ దర్శకత్వంలో వస్తున్న మల్టిస్టారర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య' చిరు-రవితేజ కాంబోలో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తుంది. చాలా ఏండ్ల తర్వాత సంక్రాంతికి పండక్కి వస్తుండటంతో బాస్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా నేడు ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి లుక్.. పాత చిరంజీవిని గుర్తుకు తెస్తున్నాయి. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. పైగా మాస్ మహారాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఈ క్రమంలో సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచుతూ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫుల్ ఊరామాస్ ఈ ట్రైలర్ అదిరిపోయింది. నేడు ఈ చిత్రం ప్రీ రీలీజ్ ఈవేంట్ జరగనుంది.