Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ వృద్ధురాలిపై మూత్రం పోసిన శంకర్ మిశ్రాకు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. ఘటన తర్వాత పరారైన శంకర్ మిశ్రా ఫోన్ను ట్రేస్ చేసిన పోలీసులు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని ఢిల్లీ తీసుకెళ్లి పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నెల 21 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు బెయిలు పిటిషన్ను ఈ నెల 11న విచారిస్తామని తెలిపింది.
పోలీసులు మూడు రోజుల కస్టడీ కోరగా, సరైన కారణాలు లేకుండా ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడు మిశ్రా ఇద్దరు ఎయిర్ ఇండియా విమాన పైలట్లు, కేబిన్ సిబ్బందికి ఫోన్లు చేస్తున్నాడని, వారిని కూడా విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.