Authorization
Fri May 16, 2025 11:03:36 pm
హైదరాబాద్ : సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. రాజ్‌కోట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ హోరాహోరీగా ఉండనుంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు 4 టీ20లు జరిగాయి. రెండు సార్లు మాత్రమే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. బౌలింగ్ ఎంచుకున్న జట్టు రెండు సార్లు విజేత అయింది. కొత్త ఏడాదిలో తొలి టీ20 సిరీస్ కావడంతో రెండు జట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. భారత్‌ను టాపార్డర్ వైఫల్యం కలవరపరుస్తోంది. రెండు మ్యాచుల్లో ఓపెనర్లు గిల్, ఇషాన్ పెద్దగా రాణించలేదు. రెండో టీ20లో 7 నో బాల్స్ వేయడంతో మ్యాచ్ చేజారింది. శ్రీలంక విషయానికి వస్తే.. ఓపెనర్లు కుశాల్ మెండిస్, కెప్టెన్ దసున్ షనక భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్ కూడా బలంగా కనిపిస్తోంది. మొదటి టీ 20లో ఇండియా 2 పరుగులతో గెలిచింది. రెండో టీ20లోభారీ స్కోర్ (206) చేసిన శ్రీలకం 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత జట్టులో ఏ మార్పు లేదు. శ్రీలంక రాజపక్సే స్థానంలో అవిష్క ఫెర్నాండోను తీసుకుంది.