Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశంపై ఆ జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాం అని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పలు విషయాలను ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఇచ్చింది ముసాయిదా మాస్టర్ ప్లాన్ మాత్రమే అని స్పష్టం చేశారు. ముసాయిదాలో మార్పులు, చేర్పులు జరుగుతాయన్నారు. రైతుల అభ్యర్థనలను నమోదు చేసుకుంటామని తెలిపారు. రైతుల అభ్యర్థనలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఎవరైనా సరే సూచనలు ఇవ్వొచ్చని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. 60 రోజుల్లో సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు 1026 అభ్యంతరాలు వచ్చాయి. రైతులకు ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. జనవరి 11న సాయంత్రం 5 గంటల వరకు అభిప్రాయాలు చెప్పొచ్చు అని కామారెడ్డి కలెక్టర్ తెలిపారు.