Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ఇచ్చింది. పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తిరిగి ఈ నెల 17న తరగతులు పునః ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యామండలి సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. సెలవుల్లో జూనియర్ కాలేజీల్లో తరగతులు నిర్వహించొద్దని ఆదేశించారు. ఎక్కడైనా తరగతులు నిర్వహించినట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.