Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శనివారం ఆయన కాన్వాయ్ కుండ్లి-మనేసర్-పాల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదానికి గురైంది. వెనక నుంచి వచ్చిన ఓ లారీ.. మంత్రి కాన్వాయ్‌లోని హై సెక్యూరిటీ సిబ్బంది ఉన్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం అనిల్ విజ్ ఉన్న సెడాన్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనను మంత్రి నిర్ధారించారు. ప్రమాద సమయంలో ట్రక్ డ్రైవర్ ఇయర్ ఫోన్లు పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నట్టు చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని, అంబాలాలోని తన నివాసానికి క్షేమంగా చేరుకున్నానని మంత్రి అనిల్ విజ్ తెలిపారు.