Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఆనంద్, దయ అనే ఆ ఇద్దరు కూలీలు యూపీకి చెందినవారు. వారి మృతదేహాలను వెలికితీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో భారీ క్రేన్ సాయంతో శిథిలాలు వెలికితీశారు. ఈ భవన యజమాని జీ ప్లస్ 2 అనుమతి తీసుకుని ఐదంతస్తుల నిర్మాణం చేపడుతున్నట్టు గుర్తించారు. నాలుగో అంతస్తుకు స్లాబ్ పనులు చేపడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. యజమానిపై కేసు నమోదు చేస్తామని అధికారులు అంటున్నారు.