Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరు గ్రామంలో పెన్నా నదిపై వంతెన శనివారం కూలిపోయింది. తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో కొందరు అధికార పార్టీ నాయకులు నదిలో ఇసుకను తవ్వి టిప్పర్లలో సామర్థ్యానికి మించి తరలిస్తున్నారు. అధిక బరువువల్ల వంతెన కూలి టిప్పర్ ఇరుక్కుపోయింది. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ దారిలోనే ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు కాలినడకన, బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. సమీపంలోని అశ్వర్థ ఆలయానికి భక్తులు విశేష సంఖ్యలో వస్తుంటారు. ఈ మార్గంలో పదుల సంఖ్యలో అధిక లోడుతో ఇసుక టిప్పర్లు వేగంగా వెళ్తుంటాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.