Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : సంక్రాంతి సందర్భంగా నడుపనున్న బస్సుల కోసం రాష్ట్రంలోని టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక మార్గం(లైన్) ఏర్పాటు కానుంది. పండుగ నేపథ్యంలో టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ నెలకొని ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవడంతోపాటు ప్రయాణికులు అధిక సమయం నిరీక్షించాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న టీఎస్ఆర్టీసీ అధికారులు టోల్‌ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ఏఐ అధికారులు, టోల్‌ప్లాజా నిర్వాహకులకు ప్రతిపాదించారు. దీనికి వారు అంగీకరించారు. ఈ నెల10 నుంచి 14వరకు హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-నిజామాబాద్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-సిద్దిపేట తదితర జాతీయ రహదారుల్లోని టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక మార్గ సదుపాయం అందుబాటులో ఉంటుందని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ప్రత్యేక బస్సుల పర్యవేక్షణకు హైదరాబాద్‌లోని బస్‌భవన్, ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.