Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు ప్రచారం చేయనున్నారు. జేడీఎస్ తరపున సీఎం ప్రచారం చేస్తారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కర్ణాటకలోని కలబురిగిలో జేడీఎస్ గుల్బర్గా జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ శివగుత్తేదార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా అధికార బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తమది డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే బీజేపీ రాష్ట్రాన్ని మాత్రం అభివృద్ధి చేయడంలో దారుణంగా విఫలమైందన్నారు. తెలంగాణలో తాము రూ. 2,016 చొప్పున పింఛను ఇస్తుంటే కర్ణాటకలో మాత్రం ఇప్పటికీ రూ. 600 ఇస్తున్నారని సత్యవతి రాథోడ్ విమర్శించారు.