Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు శివారులో ఎరసాని గూడెం వద్ద అదుపు తప్పి ఇన్నోవా కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా..మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ లో వలీమా ఫంక్షన్ కు హాజరై తిరిగి ఖమ్మం వెళ్తుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు ఎండి ఇద్దాక్ (21) ఎస్ కే.సమీర్ (21) ఎస్ కే.యాసీన్ (18) వీరంతా ఖమ్మం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.